బెల్లంపల్లి: ఈనెల 30న ఇంటర్వ్యూలు

0చూసినవారు
బెల్లంపల్లి: ఈనెల 30న ఇంటర్వ్యూలు
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ నిరుద్యోగ యువతీ యువకులకు ఈ నెల 30న మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సంవత్సర రుణాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నవారు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీ, ఒక పాస్ పోటోతో హాజరు కావాలి. బ్యాంకు మేనేజర్లతో ఇంటర్వ్యూలు జరుగుతాయి.

సంబంధిత పోస్ట్