బెల్లంపల్లి: క్రీడా పోటీల్లో న్యాయవాది ప్రతిభ

83చూసినవారు
బెల్లంపల్లి: క్రీడా పోటీల్లో న్యాయవాది ప్రతిభ
మూడో రాష్ట్రస్థాయి మహిళా న్యాయవాదుల క్రీడా పోటీల్లో బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయవాది నల్లుల సంగీత పాల్గొని పలు బహుమతులు సాధించింది. ఈ నెల 1, 2 తేదీల్లో ఖమ్మం జిల్లాలో నిర్వహించిన టోర్నమెంటులో చెస్, పాటల పోటీల్లో ప్రధమ స్థానం సాధించగా, మిగతా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. గురువారం కోర్టు ఆవరణలో జరిగిన జడ్జి ముఖేష్, న్యాయవాదులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్