మంగళవారం బెల్లంపల్లిలో కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కన్నాల గ్రామపంచాయతీలోని ఎస్సీ కాలనీలో తాటి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టు అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వర్షం ప్రజలకు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పిడుగుపాటు సంఘటన కలకలం రేపింది.