బెల్లంపల్లి: పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టిన ఎం సిపిఐ నాయకుడు

3చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని 27వ వార్డులో మురుగు కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించకపోవడంతో ప్రజలు దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన రాకపోవడంతో, ఎంసీపీఐయు జిల్లా సహాయ కార్యదర్శి పసిలేటి వెంకటేష్ స్వయంగా మురుగు కాలువల్లో దిగి పారిశుధ్య పనులను చేపట్టారు. ప్రజల సమస్యలను పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్