బెల్లంపల్లి మండలంలో రేపు ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన

69చూసినవారు
బెల్లంపల్లి మండలంలో రేపు ఎమ్మెల్యే గడ్డం వినోద్ పర్యటన
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదివారం బెల్లంపల్లి మండలంలో పర్యటించనున్నారని శనివారం అధికారులు తెలిపారు. బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామంలో బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమంలో పాల్గొంటారు. లంబడి తండా గురుకుల పాఠశాల, పాత బెల్లంపల్లిలో నిర్వహించే వన మహోత్సవంలో పాల్గొననున్నారు.