బెల్లంపల్లి: ఎమ్మెల్యే వినోద్ రాజీనామా చేయాలి

1067చూసినవారు
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడుతున్నారని, మూడు లక్షలిస్తే ఇళ్లు ఇస్తామని బేరాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏమాజి ఆరోపించారు. బెల్లంపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు చెందాల్సిన ఇళ్లను ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అమ్ముకోవడం సిగ్గుచేటని అన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.