సింగరేణి కార్మికులకు అవసరమైన మందులను సింగరేణి యాజమాన్యం వెంటనే సరఫరా చేయాలని ఏఐటీయూసీ నాయకులకు కోరారు. ఈ మేరకు సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ మధు కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. ప్రతి నెల మందుల సరఫరా లేకపోవడంతో రెండు నెలలుగా మందు నిల్వలు తగ్గిపోయాయని పేర్కొన్నారు. దీర్ఘకాల వ్యాధులకు 10 రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.