12వ వేజ్ బోర్డు కమిటీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోల్ ఇండియా యాజమాన్యాన్ని BMS నాయకులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలో జరిగిన సమావేశంలో, 11వ వేజ్ బోర్డు కాలపరిమితి మరో రెండు నెలల్లో ముగుస్తుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల చేయకపోతే సింగరేణి వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.