బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన రోడ్డు వెడల్పు కార్యక్రమంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు తెలిపారు. బెల్లంపల్లిలో సోమవారం ఆయన మాట్లాడుతూ, రోడ్డు వెడల్పులో ఒకే వైపు కూల్చివేతలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణాలు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాలని, బస్తీ, శిశు మందిర్ రోడ్లను కూడా వెడల్పు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.