బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం చైర్ పర్సన్ దావా స్వాతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజెండాలో ఉన్న పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. డంపింగ్ యార్డ్ లో మౌలిక సదుపాయాల కల్పన, వార్డుల్లో డ్రైనేజీ, ఇతర వసతి సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించినట్లు చైర్పర్సన్ తెలియజేశారు.