రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీ పౌరుడి బాధ్యత అని, ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఏసీపీ రవికుమార్ తెలిపారు. వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి వాహనదారుడు ధృవ పత్రాలు కలిగి ఉండాలని, అతివేగంగా వెళ్లకుండా ట్రాఫిక్ నియమాలు పాటించాలని సూచించారు.