బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ అండర్ బ్రిడ్జిని మూసివేయవద్దని 12, 13 వార్డులకు చెందిన నాయకులు, ప్రజలు, ఆటో యూనియన్ నాయకులు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను కోరారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించిన వారు, బ్రిడ్జి మూసివేతతో కాల్ టెక్స్ ప్రాంత వ్యాపారస్తులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి, బ్రిడ్జిని మూసివేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.