మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు కౌన్సిలర్ టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పనికిరాని వారికి బీఫామ్ లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, కార్యకర్తల ఒత్తిడితో తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.