సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో డిప్యూటీ సూపర్డెంట్ శ్రీనివాసరాజు పదవీ విరమణ సందర్భంగా గురువారం గని ఆవరణలో ఘనంగా వీడ్కోలు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా గని యాక్టింగ్ మేనేజర్ పి. రాజు మాట్లాడుతూ, రిటైర్మెంట్ అనంతరం వచ్చే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. శ్రీనివాసరాజు దంపతులను అధికారులు శాలువా, పూలమాలలతో సత్కరించి, వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.