వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 'రక్షణాత్మక డ్రైవింగ్, సురక్షిత ప్రయాణ పద్ధతులు' అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.