బెల్లంపల్లి: రోడ్డు వెడల్పు బాధితులకు ప్రత్యామ్నయం చూపాలి

5చూసినవారు
బెల్లంపల్లి: రోడ్డు వెడల్పు బాధితులకు ప్రత్యామ్నయం చూపాలి
బెల్లంపల్లి పట్టణంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి కాంటా చౌరస్తా వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయం చూపాలని సింగరేణి జేఏసీ సంఘం నాయకుడు మనిరామ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధి కోసం రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ విస్తరణతో నష్టపోతున్న వ్యాపారులకు ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్