బెల్లంపల్లి రోడ్డు విస్తరణను 100 ఫీట్ల వెడల్పు నిర్మాణం తగ్గించాలని బీజేపీ నాయకులు ఏమాజీ కోరారు. శుక్రవారం బజారు ఏరియాలో మాట్లాడుతూ, రహదారి విస్తరణలో ఉపాధి కోల్పోయిన వ్యాపారులకు వెంటనే ఇతర చోట్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంటనే జోక్యం చేసుకొని అనధికార కూల్చివేతలు నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.