బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారదాసు లక్ష్మణ్ తెలిపారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి నుంచి బూతు స్థాయి వరకు నాలుగు స్థాయిలలో సభ్యత్వ నమోదు ప్రక్రియను సమగ్రంగా వివరించారు. ఈ ప్రక్రియలో సాంకేతికతను ఉపయోగించి పారదర్శకంగా సభ్యులను చేర్చుకుంటామని ఆయన పేర్కొన్నారు.