బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లిలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సమాజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎర్ర సువర్ణ మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు స్థాపించి బాలికా విద్య కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు.