ఆషాఢమాసం బోనాల సందర్భంగా బెల్లంపల్లిలోని బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆ బంగారు మైసమ్మ తల్లిని వేడుకున్నారు.