బెల్లంపల్లి: ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

2చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏఎంసి ఏరియా బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యమ పార్టీగా అవతరించి, రాజకీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేయడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్