బెల్లంపల్లి: షెడ్లు కూల్చవద్దని చిరు వ్యాపారుల ధర్నా

0చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో, కాంటా చౌరస్తా వద్ద తమ షెడ్లను కూల్చివేయవద్దని కోరుతూ చిరు వ్యాపారులు శనివారం రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి నుండి కాంటా చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను, షెడ్లను జేసీబీతో మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. తమ దుకాణాలను తొలగించి ఉపాధిని దెబ్బతీయవద్దని వ్యాపారులు నిరసన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్