బెల్లంపల్లి: గ్రంధాలయంలో బోర్వెల్ సమస్యను పరిష్కరించండి

4చూసినవారు
బెల్లంపల్లి కాళోజి శాఖ గ్రంధాలయంలో కొన్నేళ్లుగా బోర్వెల్ సమస్య ఉందని గ్రంథాలయ అధికారి ఉప్పు గోపి తెలిపారు. బుధవారం గ్రంధాలయానికి వచ్చిన మాజీ మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్ దృష్టికి ఈ విషయాన్ని ఆయన తీసుకువచ్చారు. గ్రంధాలయానికి బోర్వెల్ మంజూరైనప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో, ప్రవీణ్ సంబంధిత అధికారులను ఫోన్లో ఆరా తీశారు. త్వరలోనే బోర్వెల్ సమస్య తీరుతుందని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :