బెల్లంపల్లి: కాళోజీ శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన తహశీల్దార్

61చూసినవారు
బెల్లంపల్లి కాళోజీ శాఖ గ్రంథాలయాన్ని గురువారం మండల తహశీల్దార్ కృష్ణ సందర్శించారు. పురుష, మహిళ పోటీ పరీక్షల అభ్యర్థుల గదులను ఆయన పరిశీలించారు. గ్రంథాలయం ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో విష కీటకాలు సంచరిస్తుంటాయని పేర్కొన్నారు. గ్రంథాలయ మెయిన్ గేట్ ముందు వాహనాలు పార్కింగ్ చేయకుండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని గ్రంథాలయ సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్