సింగరేణి కార్మికులు, ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం వచ్చే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి ఏరియా ఆసుపత్రి సూపర్‌డెంటెండెంట్ పాండురంగ చారి సూచించారు. గురువారం ఏరియా ఆసుపత్రిలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి రిటైర్ అవుతున్న దామెర సదానందం దంపతులకు ప్రత్యేక అభినందన సభ నిర్వహించి, శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, వైద్యులు, వార్డు బాయ్స్ పాల్గొన్నారు.