పదవీ విరమణ తర్వాత సింగరేణి యాజమాన్యం అందించే రిటైర్మెంట్ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా కార్మికులకు సూచించారు. బెల్లంపల్లిలోని శాంతిఖని గని సీనియర్ మైనింగ్ సర్దార్ దాసరి తిరుపతి గౌడ్, సీనియర్ సూపర్డెంట్ దేవులపల్లి రాజయ్యల పదవీ విరమణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వారి కుటుంబంతో సహా శేష జీవితం సుఖసంతోషాలతో గడవాలని ఆయన ఆకాంక్షించారు.