బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ గ్రౌండ్ స్టేడియం రాత్రిపూట మందుబాబులకు అడ్డాగా మారింది. ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల తర్వాత మద్యం సేవించి, ఖాళీ సీసాలు, చెత్తను అక్కడే పడవేస్తున్నారు. దీంతో ఉదయం వాకింగ్ కు వచ్చే వారు పగిలిన గాజు ముక్కలు, చెత్తాచెదారంతో నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టేడియంలో వాచ్మెన్ ఉన్నా, విధులు సరిగా నిర్వర్తించకపోవడంతో మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి.