బెల్లంపల్లి మున్సిపాలిటీలో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి తమకు ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలకు సూచించారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని 31వ వార్డులో మున్సిపల్ రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవీందర్ రెడ్డి, నగేష్ లతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజల ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.