పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, బెల్లంపల్లిలో గంగపుత్ర సంఘం ప్రతినిధులను శనివారం కలిశారు. గంగపుత్రుల అభివృద్ధికి పాటుపడతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు వంగల చక్రపాణి, వ్యవస్థాపక అధ్యక్షుడు దామర సదానందం, జిల్లా సలహాదారు బాసబోయిన పోతరాజు ఆధ్వర్యంలో ఎంపీని సత్కరించి, గంగపుత్ర సంఘం క్యాలెండర్ ను విడుదల చేశారు.