ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి ఆయన మొక్కులు తీర్చుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.