మైసమ్మ తల్లి కాపాడమ్మా అంటూ ట్రాక్టర్ల యజమానులు వేడుకున్నారు. భీమిని మండలంలోని వెంకటాపూర్ మైసమ్మ గుడి వద్ద రైతులు తమ ట్రాక్టర్లకు మొక్కులు చెల్లించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గురువారం రైతులందరూ కలిసి తమ గ్రామంలోని సుమారు 70 ట్రాక్టర్లను ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేయించారు. ట్రాక్టర్లకు ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని పంటలు బాగా పండాలని వేడుకున్నారు.