భీంపూర్ మండలంలోని కొజ్జన్ గూడలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నరేందర్ యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఓటర్లకు వివరించాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉన్నారని నరేందర్ యాదవ్ పేర్కొన్నారు.