ఎమ్మెల్యే అనుచరుడు జర్నలిస్టును బెదిరించడంపై కేసు నమోదు

0చూసినవారు
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరుడు కానుకూరు రామచందర్, ఎన్‌టీవీ రిపోర్టర్ రమేష్‌ను ఫోన్‌లో పరుష పదాలతో దుషించి, కబ్జాలపై వార్తలు రాస్తే చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. కుటుంబ సభ్యులను ప్రస్తావించి హెచ్చరించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టులు బెల్లంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. జర్నలిస్టు సంఘాలు ఈ చర్యను ఖండించి, నిరసన వ్యక్తం చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్