కన్నెపల్లిలో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

1చూసినవారు
కన్నెపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో సీఎం కప్ క్రీడా పోటీలను ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాము, పంచాయతీ సెక్రటరీ అనిల్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సతీష్, ఉప సర్పంచ్ సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి సత్యనారాయణ, వార్డు మెంబర్లు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్