బెల్లంపల్లి కి చేరుకున్న సిపిఐ పార్టీ బస్సు జాత

775చూసినవారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ నుంచి ప్రారంభమైన సిపిఐ పార్టీ బస్సు యాత్ర శనివారం రాత్రి బెల్లంపల్లికి చేరుకుంది. బెల్లంపల్లి పాత రామటాకిస్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే చాడే వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులతో కలిసి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ బస్సు యాత్రను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :