తాండూరులో శునకాల బీభత్సం

13చూసినవారు
తాండూరులో శునకాల బీభత్సం
తాండూర్ మండల కేంద్రంలో శనకాపులు బీభత్సం సృష్టించాయి. బస్టాండ్ ప్రాంతంతో పాటు పలు చోట్ల దాడి చేసి లక్ష్మణ్, సదయ్య, ఆర్. రాజేశ్వరి, పీ. రాజేష్, బి. సునీల్, బి. శ్వేత, శోభ, ఈ. స్వర్ణలత అనే 8 మందిని గాయపరిచాయి. క్షతగాత్రులను తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉన్న సదయ్య, రాజేష్, లక్ష్మణ్ లను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు వైద్యురాలు లక్ష్మీప్రసన్న తెలిపారు. ఒకే రోజు 8 మందిపై దాడి జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్