నెన్నెల మండలంలో కుక్కల బెడద తీవ్రమైంది. కోనంపేట, కృష్ణ పల్లి గ్రామాల్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ గత ఐదు రోజులుగా 8 పశువులను కరిచాయని గ్రామస్తులు తెలిపారు. కోనంపేటలో ఒక వ్యక్తిని తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల బారి నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.