వేమనపల్లిలో కోయ సంఘం నూతన కమిటీ ఎన్నిక

0చూసినవారు
వేమనపల్లిలో కోయ సంఘం నూతన కమిటీ ఎన్నిక
మంచిర్యాల జిల్లా, వేమనపల్లి మండలంలో ఆదివాసీ కోయ సంఘం (AKS) మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలో అలంది భీమయ్య అధ్యక్షుడిగా, కుమరం రమేష్ ప్రధాన కార్యదర్శిగా, ఆత్రం వెంకటస్వామి కోశాధికారిగా ఎన్నికయ్యారు. నూతన కోశాధికారి ఆత్రం వెంకటస్వామిని సంఘం సభ్యులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం అభివృద్ధి, ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్