బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయ మీటింగ్ హాలులో గురువారం ఎస్సీ కార్పొరేషన్ 30 యూనిట్ల రుణాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఆన్లైన్ లో 156 మంది దరఖాస్తు చేసుకోగా, 65 మంది ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలను తెలంగాణ గ్రామీణ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంకుల మేనేజర్లు, ఉద్యోగులు నిర్వహించారు.