కన్నెపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో సీఎం కప్ క్రీడా పోటీలను ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు.