కన్నేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఉప్పరి తిరుపతి వద్ద 20 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై భాస్కర్ రావు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని విచారించగా, తాండూరు మండలం రాచర్లకు చెందిన మహేష్ వద్ద ఈ విత్తనాలను కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే, మహేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఎస్సై వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.