
చీరలో టీచర్ డాన్స్.. వీడియో వైరల్
ఒక అందమైన పాఠశాల ఉపాధ్యాయురాలు చీర కట్టులో 'తుమ్ సే మిల్కే దిల్ కా హై జో హాల్' పాటకు చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది నవంబర్ 1న @Prof_Cheems అనే ఖాతా ద్వారా షేర్ చేయగా.. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించి, లైక్ చేశారు. ఆమె గ్లామర్, గ్రేస్ తో కూడిన డాన్స్ స్టైల్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతిభకు హద్దులు లేవని ఆమె నిరూపించిందని, నిజమైన సోషల్ మీడియా స్టార్ అని అందరూ ప్రశంసిస్తున్నారు.




