కాసిపేట మండల పరిధిలోని బుగ్గగూడెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాయుడు రాజేష్ (25) మృతి చెందారు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం, రాజేష్, చేదం నగేష్ బైక్‌పై బుగ్గ దేవాలయం వద్ద సమ్మక్క, సారలమ్మ జాతర నుంచి తిరిగి వస్తుండగా, బుగ్గగూడెం శివారులోని డంపు యార్డ్ వద్దకు చేరుకోగానే బైక్ నడుపుతున్న నగేష్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడంతో బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న రాజేష్‌కు తీవ్ర గాయాలై మృతి చెందాడు.