శుక్రవారం మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ కాసిపేట మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించారు. ఆయన వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం, కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను పెంచాలని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి, విద్యాబోధన చేయాలని సూచించారు.