కాసిపేట: వాగులో ఎడ్ల బండి బోల్తా - పశువులు గల్లంతై మృతి

1270చూసినవారు
కాసిపేట: వాగులో ఎడ్ల బండి బోల్తా - పశువులు గల్లంతై మృతి
కాసిపేట మండలంలోని పెద్దనపల్లి శివారులో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో బానోత్ బలరాం అనే రైతు ఎడ్ల బండితో వాగు దాటుతుండగా, నీటి ప్రవాహం పెరిగి బండి బోల్తా పడింది. దీంతో ఎడ్లు, ఆవు వాగులో కొట్టుకుపోయాయి. ఒక ఎద్దును రైతు రక్షించగలిగినా, మరో ఎద్దు, ఆవు మృతి చెందాయి. మృతి చెందిన ఎద్దు సుమారు రూ. 50 వేలు, ఆవు రూ. 40 వేల విలువ ఉంటుందని రైతు తెలిపారు.

సంబంధిత పోస్ట్