కాసిపేట మండలం దుబ్బ గూడెంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతచారి 16వ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శ్రీకాంతచారి త్యాగాన్ని తెలంగాణ చరిత్రలో ఎవరూ చెరిపివేయలేరని, అతని ప్రాణ త్యాగంతోనే తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని అన్నారు.