కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదల సొంతింటి కల సాకారం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రదీప్ చెప్పారు. కాసిపేట మండలం వివిధ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్ల నిర్మాణానికి బుధవారం ముగ్గులు పోసి పనులను బుధవారం ప్రారంభించారు. నిరుపేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తుందని వెల్లడించారు.