లక్షేటిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మోదెల గ్రామం పత్తి చేను ఏరియాలోని పొదలలో ఏర్పాటు చేసిన పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు జరిపారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్సైలు ఉపేందర్, లచ్చన్నలు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 13,120 నగదు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.