భూవివాదం: అన్న చేతిలో తమ్ముడి దారుణ హత్య

1199చూసినవారు
భూవివాదం: అన్న చేతిలో తమ్ముడి దారుణ హత్య
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో భూవివాదం ఒక ఘోర హత్యకు దారితీసింది. ఆస్తి కోసం కన్నతమ్ముడిని అన్న గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబంలో తలెత్తిన ఈ తగాదాను పరిష్కరించేందుకు గతంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించినా, వీరి మధ్య గొడవలు సద్దుమణగలేదని తెలుస్తోంది. ఈ హత్యతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్