
నేడు వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి ప్రారంభంకానున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి, మొదటి మూడు రోజులకు ఈ-డిప్లో ఎంపికైన భక్తుల వివరాలను TTD మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనుంది. గత నెల 27న ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు సోమవారం ముగిశాయి. మొత్తం 9,55,703 రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తుల వివరాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన భక్తులకు ఫోన్ ద్వారా సంక్షిప్త సందేశం పంపి, ఉచిత టోకెన్లు డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అందిస్తారు.




